Breaking News

తమిళనాట భారీ ట్విస్ట్‌.. విజయ్‌, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు

Published on Thu, 06/04/2026 - 07:23

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్‌ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. 

బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్‌ కుమార్‌ ప్రెస్‌మీట్‌లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్‌ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.

సీఎం విజయ్‌పై ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్‌ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్‌స్ట్రాగామ్‌, రీల్స్‌లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.

సొంత ఆలోచన లేదు
ప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్‌కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. 

రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్‌కు తెలియవని , ఒకవేళ విజయ్‌ నిజంగానే ఎంజీఆర్‌, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)