Breaking News

భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!

Published on Thu, 06/12/2025 - 17:23

భారత్‌లో ఇవాళ(జూన్‌ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. 

భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?

  • ఆగష్టు 7, 2020 
     ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)
    వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్‌టాప్ రన్‌వే తో పాటు  ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.
    ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారు

  • మే 22, 2010
    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక)
     వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. 
     ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.
    •  కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్‌ను రద్దు చేయడంలో విఫలమవడం, 

  • జులై 17, 2000
    జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)
    •  వివరాలు: కోల్‌కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.
    •  ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.
    •  కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.

  • నవంబర్‌ 12, 1996
    సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌, కజకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. 

  • ఏప్రిల్‌ 26, 1993
    ఔరంగబాద్‌లో ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.

  • ఆగష్టు 16, 1991
    ఇంఫాల్‌లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారు

  • ఫిబ్రవరి 14, 1990
    ఇండియన్‌ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగుతుండగా.. క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. 

  • అక్టోబర్‌ 19, 1988
    ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.

  • జూన్‌ 21, 1982
    ఎయిర్‌ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

  • జనవరి 1, 1978
    ఎయిర్‌ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. 

  • అక్టోబర్‌ 12, 1976
    ముంబైలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.

  • మే 31, 1973
    ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయి

  • జూన్‌ 14, 1972లో.. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు 

  • జులై 28, 1963లో.. యునైటెడ్‌ అరబ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారు

  • జులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్‌ఈస్ట్‌లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.

  • మే 25, 1958లో.. అన్‌ అవ్రో యార్క్‌ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్‌లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.

ఇదీ చదవండి: అహ్మదాబాద్‌ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు