Breaking News

పిల్లలు లేరు కదా అనుకుంటే.. బంధువులే రాబంధువులై..

Published on Tue, 04/11/2023 - 19:36

Viral Video: మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాన్నదానికి నిదర్శనం ఈ ఘటన. మనిషి. మనీ షీగా మారిపోయిన ఉదంతం ఇది. చనిపోయిన వ్యక్తి నుంచి ఆస్తి కాజేసే ఉద్దేశంతో బంధువులు.. ఆ శవం చేత కాలి వీలునామా కాగితాలపై వేలిముద్ర వేయించారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కాగా.. పోలీసులు ఆ వీడియోపై స్పష్టత ఇచ్చారు. 

వయసు పైబడి ఓ మహిళ కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా.. వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో.. వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక.. ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్‌ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. 

ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో.. నిర్ధారించుకోలేకపోయాడు.

కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్‌ ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా.. ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్‌లో వైరల్‌ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు.  ఈ వీడియో పాకిస్తాన్‌లోది అంటూ ప్రచారం జరిగినా.. చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు.

Disclaimer:  ఈ వీడియో కేవలం విషయం తెలియజేయడానికే.. ఎవరినీ ఇబ్బందిపెట్టడానికి కాదు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)