Breaking News

నన్నే దోచేశారు..ఇక సామాన్యుల గతేంటి? టీఎంసీ ఎంపీ ఆవేదన

Published on Sat, 11/08/2025 - 16:04

రోజురోజుకు పెరుగుతున్న  సైబర్‌ నేరాలపై పశ్చిమ బెంగాల్‌ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి కళ్యాణ్ బెనర్జీ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు, తనలాంటి ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి మోసాలకు బలైపోతే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారిని ఎవరు  రక్షిస్తారు అంటూ ఆవేదన  వ్యక్తం చేశారు. కేవీసీ అప్‌డేట్‌తో పేరుతో స్కామర్లు  రూ. 57 లక్షలు   మాయం చేసిన నేపథ్యంలో  ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు.

 వెస్ట్‌ బెంగాల్‌లోని సెరంపోర్ ఎంపి తనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందని, దానిని తాను చాలా కాలంగా దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే  నకిలీ KYC  అప్‌డేట్‌ పేరుతో తన ఫోటోను   సూపర్ ఇంపోజ్ చేసి,  పాన్ ,ఆధార్‌ను తప్పుగా ఉపయోగించి మోసానికి పాల్పడ్డారని తెలిపారు. అయితే ఏదో అంతర్గత లోపం వల్ల జరిగిందని చెప్పిన SBI   తన ఖాతాలో రూ. 57 లక్షలు జమ చేసిందని చెప్పారు. (ఎంపీకి స్కామర్ల షాక్‌ : ఎస్‌బీఐ నుంచి రూ.56 లక్షలు మాయం)

అయితే తనలాంటి  వ్యక్తుల ఖాతాలే బ్యాంకు మోసాల బారిన పడితే, ఇక, సామాన్యులెలా ఎదుర్కొంటారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ సైబర్ మోసాల నిరోధక విభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కణ్యాణ్‌ బెనర్జీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎస్‌బీఐ కోల్‌కతా పోలీసుల సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయాలని కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

ఇదీ చదవండి: దెయ్యం పట్టిందని మద్యం, బీడీ తాగించి, మహిళకు చిత్రహింసలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)