Breaking News

మూడేళ్ల తర్వాత బెంగాల్‌ మాజీ మంత్రికి బెయిల్‌

Published on Wed, 11/12/2025 - 13:01


కోల్‌కతా: స్కూల్‌ సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. మంగళవారం ఆయన అలీపూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. 2016లో చేపట్టిన స్కూళ్లలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఛటర్జీపై అభియోగాలు వచ్చాయి. దీంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు 2022 జూలై 23న అరెస్ట్‌ చేశారు. 

అనారోగ్యానికి గురైన ఆయన్ను అధికారులు ఏప్రిల్‌లో ముకుందాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు మొత్తం 8 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయినందున ఆయనకు బెయల్‌ ఇచ్చేందుకు అంగీకరించింది.

చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్‌ వీడియో

ఈ మేరకు కోర్టు ఆదేశాలు వెలువడటంతో ప్రెసిడెన్సీ జైలు అధికారులు ఛటర్జీని విడుదల చేశారు. సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయితే పార్థ ఛటర్జీకి బెయిలివ్వ వచ్చునంటూ ఆగస్ట్‌ 18వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందే, ఛటర్జీకి ఈడీ కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. ఆయన్ను మరే లాభదాయక పదవుల్లో నియమించరాదనే షరతుతో కలకత్తా హైకోర్టు సెప్టెంబర్‌ 26న బెయిల్‌కు పచ్చజెండా ఊపింది. బెయిల్‌పై పార్థ ఛటర్జీ విడుదలవడంతో కోల్‌కతాలోని ఆయన నివాసం వద్ద టీఎంసీ కార్యకర్తలు హడావుడి చేశారు.  

ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్‌ హౌస్‌, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)