Breaking News

Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..

Published on Thu, 01/16/2025 - 13:06

అందరినీ ఆకట్టుకునే సోషల్‌ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని  కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్‌ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..

మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని  ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది.
 

ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన  ఒక యూజర్‌ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్‌ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)