Breaking News

జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్‌ కోరొచ్చు

Published on Tue, 09/10/2024 - 05:33

న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్‌ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్‌ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్‌ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. 

కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్‌ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్‌ సారాంశానికి,

 చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్‌ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్‌ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్‌ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్‌ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)