Breaking News

జవాబుదారీతనం పెంచేలా లేదు 

Published on Fri, 07/24/2026 - 05:15

న్యూఢిల్లీ: పేపర్‌ లీక్‌ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్‌–యూజీ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే గురువారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘హాయ్‌.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్‌ ఫొటోను షేర్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్‌ రాంకా    తేలి్చచెప్పారు. 

పేపర్‌ లీక్‌ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్‌ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్‌ లీక్‌ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)