Breaking News

నిజంగా బీజేపీకి ఇది పెద్ద గుణపాఠం!

Published on Thu, 05/11/2023 - 18:37

ఢిల్లీ పాలనా వ్యవహారాల నియంత్రణ  లెఫ్టినెంట్ గవర్నర్‌దా? లేక ప్రభుత్వానిదా ? అన్న విషయంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ నేత రాఘవ చద్ధా స్పందిస్తూ..ఈ తీర్పు బీజేపీకి అతి పెద్ద గుణపాఠమని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగం అందించిన చక్కటి అధికార సమతుల్యతను భంగపరచకూడదని చెప్పకనే చెప్పింది అత్యున్నత న్యాయస్థానం.

ఇది నిజంగా బీజేపికీ ఒక పెద్ద గుణపాఠం కావాలన్నారు. ఇది ముమ్మాటికి ఢిల్లీ ప్రజల విజయమేనని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ‍ప్రజా ప్రతినిధులమైన మేము ఇప్పుడూ హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని ఎద్దేవా చేశారు. అలాగే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అణగదొక్కడానికి బీజేపీ అనుసరించే ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి లేదా రాజకీయాలకైనా మంచిది కాదని ఇప్పటికైన గ్రహించాలన్నారు. సుప్రీం కోర్టు కూడా ఈ రోజు దాన్నే చెప్పిందన్నారు.

అంతేగాదు ఢిల్లీ ప్రభుత్వాన్ని అధిగమిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు బ్యూరోక్రసిపై పూర్తి అధికారాన్ని ఇచ్చిన మే 2015 నాటి కేంద్ర నోటిఫికేషన్‌ను గుర్తు చేస్తూ..దీనికి కేవలం రాజకీయమే కారణమని చద్ధా అన్నారు. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వానికి ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య ఎనిమిదేళ్లుగా జరుగుతున్న గొడవల తర్వతా అత్యున్నత​ న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకు  జవాబుదారి అని,  నిజమైన అధికారాలు అసెంబ్లీకే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆఖరికి అధికారుల నియామకం సహా ఢిల్లీ ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని పేర్కొంది సుప్రీం కోర్టు.

( చదవండి: రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)