Breaking News

గుజరాత్‌లో బీజేపీకి బిగ్‌ షాక్‌

Published on Tue, 06/24/2025 - 06:39

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) బీజేపీకి గట్టి షాక్‌ ఇచి్చంది. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక స్థానంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మరో స్థానంలో అధికార బీజేపీ నెగ్గింది. లూథియానా వెస్ట్‌(పంజాబ్‌), కాళీగంజ్‌(పశ్చిమ బెంగాల్‌), కాడీ, విసావదర్‌(గుజరాత్‌), నీలంబూర్‌(కేరళ) శాసనసభ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరిగాయి.

 సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. విసావదర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా ఘన విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌పై 17 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోపాల్‌ ఇటాలియాకు 75,942 ఓట్లు రాగా, కిరీట్‌ పటేల్‌కు 58,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో విసావదర్‌ నుంచి గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

 దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. తమ సిట్టింగ్‌ స్థానాన్ని ఆప్‌ నిలబెట్టుకుంది. కాడీ ఎస్సీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్‌ సోలంకీ మృతిచెందడంతో ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్‌ మళ్లీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్‌ అరోరా కాంగ్రెస్‌ అభ్యర్థి భరత్‌ భూషణ్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి జీవన్‌ గుప్తా మూడో స్థానంలో నిలిచారు. లూథియానా వెస్ట్‌లో ఆప్‌ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్‌బస్సీ గోగీ మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. 

బెంగాల్‌లోని కాళీగంజ్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అలీఫా అహ్మద్‌ బీజేపీ అభ్యర్థి ఆశీష్‌ ఘోష్‌పై 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీఫా తండ్రి, తృణమూల్‌ ఎమ్మెల్యే నజీరుద్దీన్‌ అహ్మద్‌ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. కేరళలోని నీలంబూర్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అభ్యర్థి అర్యదన్‌ షౌకత్‌ వామపక్ష అభ్యర్థి ఎం.స్వరాజ్‌పై 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నీలంబూర్‌ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా    గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 

గుజరాత్, పంజాబ్‌లో మాదే విజయం: కేజ్రీవాల్‌  
గుజరాత్, పంజాబ్‌ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం పట్ల ఆప్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్‌ సోమవారం హర్షం వ్యక్తంచేశారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్‌ అని, ఇందులో తామే గెలిచామని స్పష్టంచేశారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓటర్లు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని అన్నారు. ఆప్‌ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. 
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)