Breaking News

కేజ్రీవాల్‌ ప్రాణాలతో బీజేపీ చెలగాటం: ఆప్‌ ఎంపీ సంజయ్‌

Published on Sat, 07/13/2024 - 16:19

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై  తిహార్‌  జైలులో  ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్ అన్నారు. ఆయన  శనివారం మీడియాతో మాట్లాడారు. తిహార్‌ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ బరువు 8. 5 కేజీలు  తగ్గారని, అదేవిధంగా ఆయన షుగర్ లెవల్స్‌ 5 సార్లు 50 ఎంజీ/డీఎల్‌ కిందికి  పడిపోయాయని  తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ జైలులో తీవ్రమైన అనారోగ్యంతో బాధపెట్టాలని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలా చేయటం అత్యంత ఆందోళనకరమైన విషయమని అన్నారు.

‘‘మార్చి 21 తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్ట్‌ చేసేనాటికి ఆయన బరువు 70 కేజీలు, కానీ, ప్రస్తుతం కేజ్రీవాల్‌ బరువు  61. 5 కేజీలకు పడిపోయింది. అంటే  8. 5 కేజీల బరువు తగ్గారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ను చిత్రహింసలకు గురిచేసి.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కేజ్రీవాల్‌ను బాధ పెట్టడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇలా  బరువు తగ్గటంపై ఎటువంటి పరీక్షలు నిర్వహించటం లేదు. బరువు తగ్గటం, షుగర్ లేవల్స్‌ పడిపోవటం కేజ్రీవాల్‌ తీవ్ర అనారోగ్యానికి సంకేతాలు.  ఇప్పటికే ఐదుసార్లు షుగర్‌ లేవల్స్‌ లెవల్స్‌ పడిపోయాయి.  50 ఎంజీ/డీఎల్‌ కంటే కిందికి పడిపోతే  ఆరోగ్యం క్షీణించి  కోమాకు వెళ్తారు. కేజ్రీవాల్‌పైనే ఎందుకు  ఇలా చేస్తున్నారు?’అని సంజయ్‌ సింగ్‌ మండిపడ్డారు.  

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్ట్‌ చేయటంతో కేజ్రీవాల్‌ ఏప్రిల్‌1 నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం ఈడీ అరెస్ట్‌ కేసులో శుక్రవారం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజారు చేసింది. అయినా  కూడా కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులోనే ఉండాల్సి వచ్చింది.  లిక్కర్‌ కేసులో ఆయన్ను దర్యాప్తు కోసం సీబీఐ అరెస్ట్‌  చేసిన విషయం తెలిసిందే.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)