Breaking News

9 ఏళ్ల బాలిక, క్లాస్‌ రూంలోనే కుప్పకూలిపోయింది!

Published on Wed, 11/04/2026 - 19:10

తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 2లో ఉన్న 'లవ్లీ హెరిటేజ్ స్కూల్'లో మూడవ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక,  క్లాస్‌ రూంలోనే అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన ఘటన దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. బాలిక ఉన్నట్టుండి కుప్పకూలిన షాకింగ్‌ దృశ్యాలు  పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్లైనాయి. అయితే  బాలికకు సకాలంలో ప్రథమ చికిత్స లేదా సీపీఆర్ (CPR) అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సీసీటీవీ విజువల్స్ ప్రకారం  గేమ్స్ పిరియడ్ పూర్తయ్యాక బాలిక క్లాస్‌రూమ్‌లోకి వచ్చింది. నడుముపై చెయ్యి వేసుకుని అలసటగా  కదులుతుననట్టు అనిపించింది. అక్కడున్న వారు ఆమెను గమనించేలోపే అకస్మాత్తుగా కిందపడి పోయింది. గమనించిన ఉపాధ్యాయురాలు  వెంటనే బాలికను లేపి సీట్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నించగా, బాలిక పూర్తిగా స్పృహ తప్పినట్లు కనిపించింది. దాంతో ఉపాధ్యాయురాలు వైద్య సహాయం కోసం బాలికను ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు.

పాఠశాల సిబ్బంది బాలికను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి, అక్కడి నుండి నిర్మాణ్ విహార్‌లోని మాలిక్ ఆసుపత్రికి తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

ఇదీ చదవండి : భార్య వేధింపులతో బీజేపీ నేత కుమారుడి ఆత్మహత్య, వీడియో వైరల్‌

 

కుటుంబ సభ్యుల ఆరోపణలు
పాఠశాల యాజమాన్యం అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలలో సరైన వైద్య ఏర్పాట్లు లేవని, పాప కుప్పకూలిన వెంటనే సీపీఆర్ (CPR) ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు.

 

 

పాఠశాల యాజమాన్యం స్పందన:
బాలిక కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే మరణించిందని ప్రిన్సిపాల్ భావనా మాలిక్ తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే  హుటాహటిన ఆమెను ఆసుపత్రికి తరలించామని, పాఠశాలలో నర్స్ కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. బాలిక కిందపడినప్పుడు గడ్డానికి దెబ్బతగిలి రక్తం రావడం చూసి, ఆ గాయం వల్లే స్పృహ తప్పిందేమోనని మొదట భావించినట్లు వివరించారు.

ప్రస్తుతం పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తొలి సహాయం (First Aid),  సీపీఆర్ (CPR) ట్రైనింగ్ ఉండాల్సిన అవసరంపై మళ్లీ చర్చ మొదలైంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)