Breaking News

కోట్ల ఆస్తిని ప్రభుత్వ పరం చేసిన వృద్ధుడు! ఎందుకంటే..

Published on Mon, 03/06/2023 - 15:22

ఒక వ్యక్తి తన కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి ధారాదత్తం చేశాడు. ఆఖరికి తన మృతదేహాన్ని సైతం వైద్య పరిశోధనలకు ఉపయోగించమని అధికారులును కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫర్‌ నగర్‌లో 85 ఏళ్ల నాథూ సింగ్‌ అనే వ్యక్తికి సొంత ఇల్లు, కొంత భూమి ఉంది. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు. అతనికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సహరాన్‌పూర్‌లో స్కూల్‌ టీచర్‌గా పనిచేసేవాడు. ఐతే ఇటీవలే అతడి భార్య మరణించడంతో ఒంటరివాడైనా ఆ పెద్ద మనిషి ఓల్డేజ్‌ హోంకి వెళ్లిపోయాడు.

గత ఏడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. తనను చూసేందుకు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆయన తన ఆస్తి మొత్తం ‍ప్రభుత్వానికి రాసిస్తూ.. వాటిని ఆస్పత్రి, పాఠశాల నిర్మించేందుకు వినియోగించమని కోరాడు. ఈ వయసులో తన బాగోగులు చూసుకోవాల్సిన కొడుకు, కోడలు తనను సరిగా పట్టించుకోకపోవడంతో తన ఆస్తిని ఇలా ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఆఖరికి తను చనిపోయాక తన మృతదేహాన్ని వైద్య పరిశోధనల కోసం ఇచ్చేయాలని చెప్పాడు.

ఎందుకంటే తన అంత్యక్రియల సమయం అప్పుడూ కూడా తన కొడుకు, కూతుళ్లు తనను చూసేందుకు రాకూడదని చెప్పాడు. ఈ మేరకు ఆ ఓల్డేజ్‌ హోం మేనేజర్‌ రేఖా సింగ్‌ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఇ‍క్కడే ఉంటున్నాడని, కానీ తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరూ తనను చూసేందుకు రాలేదని చెప్పారు. దీంతో నాథూ సింగ్‌ బాగా కలత చెంది ఇలా చేసినట్లు వివరించారు. కాగా, నాథూ సింగ్‌ వీలునామా మాకు అందిందని, ఆయన మరణాంతరం అది అమలులోకి వస్తుందని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పేర్కొంది. 
(చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)