18 అడుగుల శానిటరీ ప్యాడ్‌ రూపొందించి..

Published on Sun, 10/27/2024 - 13:31

నోయిడా: మహిళల రుతుక్రమానికి సంబంధించిన అపోహలను తొలగించేందుకు, దీనిపై మరింత అవగాహనం పెంపొందించేందుకు యూపీలోని నోయిడాలో గల ఛాలెంజర్స్ గ్రూప్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.

దీనిలో భాగంగా మహిళా సాధికారతకు చిహ్నంగా 81 అడుగుల పొడవు, 29 అడుగుల వెడల్పు కలిగిన శానిటరీ ప్యాడ్‌ను రూపొందించారు. ఛాలెంజర్స్ గ్రూప్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1200 మంది బాలికలు పాల్గొన్నారు. ఆరు వేల శానిటరీ ప్యాడ్‌లను  ఉచితంగా పంపిణీ చేశారు. బహిష్టు సమయంలో పరిశుభ్రత  ప్రాముఖ్యత గురించి నిర్వాహకులు బాలికలకు అవగాహన కల్పించారు.

వైద్య నిపుణురాలు శాలిని ఆధ్వర్యంలో  పలు అవగాహనా కార్యక్రమాలు, క్విజ్ పోటీ, పోస్టర్ పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాలెంజర్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ప్రిన్స్‌ శర్మ మాట్లాడుతూ మహిళలు, బాలికలకు రుతుక్రమంలో పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ది పవర్‌ ఆఫ్‌ షీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  ఛాలెంజర్స్ గ్రూప్ మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ, అక్కడి బాలికలకు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలియజేస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)