Breaking News

Maharashtra: లోయలో పడిన పికప్‌ వ్యాన్‌.. ఎనిమిదిమంది దుర్మరణం

Published on Sat, 10/18/2025 - 16:13

నందూర్బార్‌: మహారాష్ట్రలోని నందూర్బార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం.. పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది  అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 

ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన  భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు