Breaking News

వరద బీభత్సం.. హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

Published on Thu, 08/28/2025 - 16:44

ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్‌-కులు​-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ప్రధానంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ ప్రాంతానికి పండ్లు, కూరగాయలు తీసుకెళ్తున్న వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. హైవేపై చిన్న వాహనాలకు అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ.. భారీ ట్రక్కులను నిలిపివేశారు. ఆపిల్, టమాటా, ఇతర కూరగాయల లోడ్లు పాడవుతున్నాయని ట్రక్కు డ్రైవర్లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కు లోడ్ విలువ లక్షల్లో ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు.

మండి-కుల్లు మధ్యలో కొండచరియల విరిగి పడటంతో సహాయక పనులు చేపట్టారు. క్లియరెన్స్ పనులు కారణంగా ట్రాఫిక్‌కు ఆలస్యమవుతోంది. బియాస్ నది ఉధృతంగా ప్రవహించడం వల్ల జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. మరమ్మతులు కొనసాగుతున్నాయి. కుల్లు ప్రాంతంలోని రామశిల సమీపంలో వరదల ప్రభావంతో ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. మనాలి ఒక వైపు నుండి ఇతర ప్రాంతాలతో ఉన్న రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపొయాయి.

మంగళవారం సాయంత్రం నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు, భారీ వర్షాలు, వరదలు కారణంగా సుమారుగా 158 మంది మరణించగా.. 38 మంది గల్లంతయ్యారు.. రూ. 2,623 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

 

 

 

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)