Breaking News

కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి

Published on Mon, 07/20/2026 - 21:12

ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు దగ్గర కార్గో నౌకపై దాడి జరిగింది. నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి కార్గో నౌకలో ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిపై భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో నౌక జులై 19 సాయంత్రం ఒడెసా నుంచి బయలుదేరిన వెంటనే దాడికి గురైంది. ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు.

"ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. నలుగురు భారతీయులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని భారత్ తెలిపింది. "మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన భారతీయుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నల్ల సముద్రం ప్రాంతంలో తాజాగా పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత భారతీయ నావికులు ఎదుర్కొన్న అత్యంత ప్రాణాంతక ఘటనల్లో ఇది ఒకటి.

వాణిజ్య నౌకలపై దాడులు సరికాదు: భారత్ 
ఈ ఘటనపై స్పందించిన భారత్‌.. పౌర నౌకలపై దాడులను ఖండించింది. యుద్ధ పరిస్థితుల్లోనూ సముద్ర రాకపోకల స్వేచ్ఛకు రక్షణ ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు తేవడం, సముద్ర రాకపోకలు, వాణిజ్యానికి ఆటంకం కలిగించడం ఖండించదగ్గ విషయం. అలాంటి చర్యలు నివారించాలి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆ ప్రకటనలో రష్యా పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఈ దాడికి రష్యాదే బాధ్యతని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గం ద్వారానే పరిష్కారం లభించాలని భారత్ పలుమార్లు పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే దాడులు చేయవద్దని అన్ని పక్షాలను కోరింది.

#

Tags : 1

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)