Breaking News

‘పెద్ద ప్లానే’.. నలుగురు ఉగ్రవాదుల ఆటకట్టించిన ఏటీఎస్‌

Published on Thu, 07/24/2025 - 08:10

న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ రాకెట్‌ను నడుపుతూ,  ప్రపంచ ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సాయపడుతున్న అల్ ఖైదాతో సంబంధం కలిగిన నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. పట్టుబడిన ఉగ్రవాద నిందితులు  మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్‌ అలీలు అల్ ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్‌ వర్గాలు తెలిపాయి. అలాగే వీరు తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని సమాచారం.

ఈ నిందితులు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్‌ అధికారులు గుర్తించారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని వెల్లడైందన్నారు. వారి చాట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురూ సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారని, ఢిల్లీ నివాసి ఫైక్.. పాకిస్తాన్ ఇన్‌స్టాగ్రామ్  యూజర్‌తో పరిచయం పెంచుకుని, భారతదేశంలో జిహాదీ కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి చర్చించారని తమకు తెలిసిందని తెలిసిందని గుజరాత్ ఏటీఎస్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సునీల్ జోషి పేర్కొన్నారు.

ఈ నలుగురు నిందితుల ప్రధాన ఎజెండా  అల్‌ఖైదా భావజాలం వైపు యువతను ఆకర్షించడం. హింస ద్వారా షరియాను స్థాపించడానికి, తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించేందుకు యవతను ప్రేరేపించేందుకు వారు పనిచేస్తున్నారని సునీల్‌  జోషి తెలిపారు. వారి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో  అల్‌ఖైదా సాహిత్యం, షరియాను స్థాపించాలని పిలుపునివ్వడం, మత విద్వేషాన్ని సృష్టించే  ప్రకటనలు ఉన్నాయని ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

నిందితుల ప్రవర్తన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించడానికి, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అణగదొక్కడానికి  ఉపకరించేదిగా ఉందని డీఐజీ తెలిపారు. కాగా ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం నెలకొల్పిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుండి అల్-ఖైదా ఉద్భవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే సంస్థగా  ఉంది. అల్-ఖైదా ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో విస్తరించి ఉంది. 1996 నుండి 2001 చివరి వరకు అల్‌ఖైదాను తాలిబాన్ రక్షణలో బిన్ లాడెన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులు పర్యవేక్షించారు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)