Breaking News

మొన్న ప్రణీత్‌, ఇపుడు మధుర్‌ విర్లీ : వీడియో వైరల్‌

Published on Sat, 06/13/2026 - 11:36

స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్‌ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.

2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు.

 

మండిపడుతున్న నెటిజన్లు
ఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే  వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.

మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై  కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే  తాజాగా ఈ వివాదంపై ప్రణీత్‌ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)