Breaking News

శివసేనలో మరో ట్విస్ట్‌.. ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ!

Published on Sun, 10/02/2022 - 14:40

మహారాష్ట్రలో పొలిటికల్‌ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్‌ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వర్గానికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఉద్దవ్‌ వెంట ఉన్న శివసేన కార్యకర్తలు ఒక్కొక్కరుగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గంలోకి వెళ్తున్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా ముంబైలో ఉద్దవ్‌ థాక్రే, ఆదిత్యా థాక్రేకు ఊహించని షాక్‌ తగిలింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన దాదాపు 3000 మంది శివసేన, ఉద్దవ్ థాక్రే మద్దతుదారులు ఆదివారం సీఎం షిండే వర్గంలో చేరారు. అయితే, ముంబైలో దసరా సందర్భంగా తన మద్దతుదారులతో ర్యాలీ చేసేందుకు థాక్రే.. ముంబై హైకోర్టు నుంచి పర్మిషన్‌ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్దవ్‌ మద్దతుదారులు ఇలా హ్యాండిచ్చి.. షిండే వర్గంలో చేరడంతో ఊహించని విధంగా షాక్‌ తగిలినట్టు అయ్యింది. 

మరోవైపు.. ముంబైలోని వర్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచే ఆదిత్య థాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కాగా, తాజా పరిణామం కారణంగా ఆదిత్య థాక్రేకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఇటీవలే శివసేన గుర్తు గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్‌ థాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)