Breaking News

కాలువలో పడిన కారు.. 11 మంది మృతి 

Published on Mon, 08/04/2025 - 04:35

గోండా: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది కాలువలో కారు పడిపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సహా 11 మంది మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. వీరంతా ఖర్గుపూర్‌లోని  పృథ్వీనాథ్‌ ఆలయానికి వెళ్తుండగా బెల్వా బహుతా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితులంతా గోండా జిల్లా సిహాగావ్‌ గ్రామానికి చెందిన వారని ఇటియాథోక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కృష్ణ గోపాల్‌ రాయ్‌ చెప్పారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌ సహా 15 మంది ఉన్నారన్నారు.

 గ్రామస్తులు, సహాయక బృందాల సాయంతో కాలువలో మునిగిన వాహనం నుంచి 11 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన వివరించారు. వర్షం కురుస్తుండటంతో రోడ్డంతా జారుడుగా మారిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి కాలువలో పడిపోయిందని తెలిపారు. వెంటనే పోలీసులకు తెలిపామన్నారు. తాడు సాయంతో వాహనాన్ని బయటకు లాగామన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సిహాగావ్‌లో మేవాలాల్‌ మాధ్యమిక పాఠశాల మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రహ్లాద్‌ కుటుంబంలోని 9 మంది ఉన్నట్లు చెప్పారు. 

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఆలయానికి వెళ్తున్న వారు ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. కాగా, మృతుల్లో ప్రహ్లాద్‌ భార్య బీనా, ఇద్దరు కుమార్తెలు కాజల్, రింకీ, ప్రహ్లాద్‌ సోదరుడు రాంకరణ్, ఆయన భార్య అనుసూయ, వీరి కుమార్తె సౌమ్య, కుమారుడు శుభ్, ప్రహ్లాద్‌ మరో సోదరుడు రాంరూప్, ఆయన భార్య నందిని, కుమారుడు అమిత్‌ ఉన్నారు. ప్రహ్లాద్‌ పొరుగింట్లో ఉండే రామలలన్‌ వర్మ భార్య సంజు, అతడి సోదరి అంజు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ప్రహ్లాద్‌ కుమారుడు సత్యం, రామ్‌ లలన్‌ వర్మ, వాహనం డ్రైవర్‌ సీతారామన్‌ గాయపడ్డారు. వీరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం తెలిసిన సిహాగావ్‌ గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)