Breaking News

ఢిల్లీలో హై అలర్ట్‌.. 285 మంది అరెస్ట్

Published on Sat, 12/27/2025 - 12:16

న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్‌ నిర్వహించారు.

‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో  ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.

న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)