Breaking News

2025 చివరి సూర్యోదయం చూశారా?

Published on Wed, 12/31/2025 - 09:13

మరికొద్ది గంటల్లో.. 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో.. చివరి సూర్యోదయం వీక్షించేందుకు తమిళనాడు కన్యాకుమారి సముద్ర తీరానికి జనం పోటెత్తారు. 

ప్రతిసారిలాగే.. ఈ ఏడాది చివరి రోజు ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రం కన్యాకుమారి సందర్శకులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. తిరువల్లువర్‌ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి సూర్యోదయాన్ని వేలమంది వీక్షించారు. నారింజ రంగులో ఆకాశంలో కనిపించిన ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో బంధించారు. 

ప్రత్యేకం ఎందుకంటే.. 

కన్యాకుమారి భారతదేశ దక్షిణ అంచున ఉంది. ఇక్కడి సూర్యోదయం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఇక్కడి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు, పర్యాటకులు చేరుతారు. అందుకు కారణం.. అరేబియా సముద్రం, బెంగాల్ ఖాతం, భారత మహాసముద్రం కలిసే అరుదైన ప్రదేశం కాబట్టి. 

ఈ సంగమం వద్ద సూర్యోదయం చూడటం ఒక ప్రత్యేక అనుభవం. అలాగే సూర్యాస్తమయం కూడా. దేశంలో చాలా అరుదుగా ఒకే ప్రదేశంలో సముద్రంపై సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ వీక్షించగల అవకాశం ఇక్కడ ఉంది. అయితే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగానే కాకుండా.. ఆధ్యాత్మిక ధోరణిలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. సూర్యోదయాన్ని దైవానుభూతిగా భావించే భక్తులు.. సంవత్సరాంతం,  ఏడాది తొలిరోజు.. పండుగల సమయంలో ప్రత్యేకంగా సముద్ర స్నానాలు చేస్తారు.  

సుందర దృశ్యాలు.. 
ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశంలో నారింజ, బంగారు, ఎరుపు రంగులతో కాంతులు కనిపిస్తాయి. సముద్రపు అలలపై ఆ ప్రతిబింబం పడటంతో ఆ దృశ్యాన్ని మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నిత్యం ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుక పనిగట్టుకుని పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)