Breaking News

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌, ఇద్దరు జవాన్లు మృతి

Published on Sat, 08/10/2024 - 20:43

జమ్మూకశ్మీర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లా అహ్లాన్‌ గడోల్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

విదేశీ పౌరులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు, ఆర్మీ పారాట్రూపర్‌లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు తనిఖీలు చేస్తుండగా జవాన్లపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా.. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో కాల్పులు ఇంకా  కొనసాగుతున్నాయి. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)