Breaking News

మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌

Published on Tue, 06/17/2025 - 20:08

షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్‌ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని,  మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో గుర్తించారు.

ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్‌ బృందం సీన్ రీకన్‌స్ట్రక్షన్  చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్‌ 17) ఘటన జరిగిన  సోహ్రాలోని వీ సావ్‌డాంగ్  జలపాత 
ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వివేక్‌ వివేక్‌ సియాం వెల్లడించారు.

మరి మరో ఆయుధం ఎక్కడ?
సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు.

 సోనమ్‌ సైగ.. రాజాపై విశాల్‌ కత్తితో దాడి
నిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్‌కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్‌ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్‌ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్‌ చౌహాన్‌ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు.  

రాజా హత్యను సోనమ్‌ కళ్లారా చూసింది
‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్‌ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్‌ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్‌దాంగ్‌ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్‌లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.

పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్య
ఏప్రిల్‌ 23న రాజా రఘువంశీ,సోనమ్‌ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ  హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్‌  తన ప్రియుడు సాయంతో విశాల్‌ చౌహాన్‌,ఆనంద్‌ కుమార్‌,కాష్‌ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్‌డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్‌ 2న  దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)