Breaking News

Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

Published on Tue, 07/29/2025 - 10:40

దేవఘర్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు.. గ్యాస్‌ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేవఘర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భక్తులతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొన్నదని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే  సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవఘర్‌లో కన్వర్‌ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నదని,  బస్సు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
 

ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఒక అధికారి తెలిపారు. ఈ ఘటన దరిమిలా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు