Breaking News

Pune Drug Case: వీడియో బహిర్గతంతో 14 మంది అరెస్ట్‌

Published on Tue, 06/25/2024 - 11:40

మహారాష్ట్రలోని పూణెలో ఓ పబ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్‌లో కూర్చుని కొందరు డ్రగ్స్ తీసుకోవడం దానిలో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

అక్రమ పబ్‌లపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని పబ్‌లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూణెలోని ఫెర్గూసన్ రోడ్డులోని ఒక పబ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది.

పబ్‌లోని వాష్‌రూమ్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో  ఆరుగురు వెయిటర్లతో మొత్తం ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కేసులో నలుగురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన  ఎనిమిది మందిని జూన్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

పుణె పోలీసులు పబ్ యజమాని సంతోష్ విఠల్ కమ్తే, సచిన్ కమ్తేతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లోని ప్రధాన గేటును మూసివేసి, మరో గేటు ద్వారా పబ్‌లో కూర్చున్నవారికి వెయిటర్లు మత్తు పదార్థాలు అందించారని పోలీసులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు పబ్‌కు సీల్‌ వేసి, డ్రగ్స్‌ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)