Breaking News

మోదీ 11 ఏళ్ల పాలన స్వర్ణయుగం 

Published on Tue, 06/10/2025 - 05:19

న్యూఢిల్లీ:  కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సోమవారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే మూడో టర్మ్‌లో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో మోదీ పాలనపై పలువురు కేంద్ర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ఈ 11 ఏళ్లు ప్రజాసేవలో స్వర్ణయుగం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అభివరి్ణంచారు.

మోదీ నాయకత్వంలో నవ భారతదేశం సంస్కరణల శక్తి, మార్పుతో అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారా ప్రతి రంగంలో మన దేశాన్ని నంబర్‌ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తోందని వెల్లడించారు. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని స్పష్టంచేశారు. 11 ఏళ్ల ఈ చరిత్రాత్మక ప్రయాణం సేవా ప్రయాణమని వివరించారు. ఈ మేరకు అమిత్‌ షా సోమవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 

నాయకత్వం శక్తివంతంగా, సంకల్పం బలంగా, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే  ప్రజాసేవ, భద్రత, సుపరిపాలనలో కొత్త రికార్డులు సృష్టించవచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందని తెలియజేశారు. మోదీ 2014లో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశం అచేతనావస్థలో ఉందని, ఎటు చూసినా కుంభకోణాలు తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక 11 ఏళ్లలో దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రధాని మోదీ దేశంలో బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడేశారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అమిత్‌ షా హర్షం వ్యక్తంచేశారు. రైతులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితుల సాధికారతే మోదీ సర్కారు ధ్యేయమని తేలి్చచెప్పారు.   

దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం తిరుగులేని అంకితభావం ప్రదర్శిస్తోందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశానికి మోదీ సర్కారు బలమైన రక్షణ కవచంగా మారిందన్నారు. దృఢమైన, గర్వకారణమైన ఐక్య భారత్‌ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కూడా చేరిందన్నారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. మోదీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బడుగ బలహీన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూరుతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ‘న్యూ ఇండియా’కు మోదీ ప్రభుత్వం పునాది వేసిందన్నారు. 

ప్రపంచ వేదికపై సమున్నత భారత్‌: గడ్కరీ   
నరేంద్ర మోదీ దార్శనికత పాలనలో దేశంలో చరిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వివరించారు. సుపరిపాలన, సమగ్రాభివృద్ధిని కళ్లారా చూస్తున్నామని వ్యాఖ్యా నించారు. దేశం ఎవరూ అందుకోలేనంత వేగంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందన్నారు. బలమైన నాయకత్వం, స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ, ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న పాలనతో ప్రపంచ వేదికపై సగర్వంగా, సమున్నతంగా నిలుస్తోందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, సాంస్కృతిక వైభవం, జాతీయ భద్రత విషయంలో మోదీ పాలన నూతన శకమని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అగ్రనేత చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించాలి: నడ్డా
దేశంలో గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సువర్ణాక్షరాలతో లిఖించదగనవని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా చెప్పారు. మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌కు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు.    
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)