Breaking News

11 ఏళ్లలో 33 తప్పులు

Published on Thu, 06/12/2025 - 06:20

కలబురిగి: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో 33 తప్పులు చేసిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేవలం అబద్ధాలు, మోసాలతో  మోదీ కాలం గడిపే స్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా దగా చేశారని, ఓట్ల కోసం పేదలను వాడుకున్నారని మోదీపై మండిపడ్డారు. ప్రధానమంత్రి మోసాలపై పార్లమెంట్‌లోనూ తాను గళమెత్తానని తెలిపారు. తాను 65 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇందులో 55 ఏళ్లు పదవుల్లో ఉన్నానని, నరేంద్ర మోదీ లాంటి మోసకారి ప్రధానమంత్రిని ఏనాడూ చూడలేదని ధ్వజమెత్తారు. 

బుధవారం కర్ణా టకలోని కలబురిగిలో మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. చెప్పింది మోదీ ఏనాడూ చేయలేదని, అదేమిటని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదని విమర్శించారు. ఆయనకు అబద్ధాలు తప్ప మరొకటి తెలి యదన్నారు. మోదీ తప్పుల జాబితాలో పెద్దనోట్ల రద్దు, ఉద్యోగాల సృష్టి జరగకపోవడం, పంటలకు కనీస మద్దతు దక్కపోవడం వంటివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తప్పులన్న విషయం ప్రధాని అంగీకరించడం లేదని విమర్శించారు. చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పకపోగా మాటలతో మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. 11 ఏళ్లు గడిచిపోయానని, ఇప్పటిదాకా చేసిందేమీ లేదని ఆక్షేపించారు. 

డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి 
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఖాళీగా కొనసాగిస్తుండడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలని సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాల న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌ పోస్టు ఖాళీగా ఉన్న దాఖలాలు ఏనాడూ లేవని వెల్లడించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)