కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!

Published on Fri, 07/24/2026 - 14:45

సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్‌ లీకేజీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఇకపై పేపర్‌ లీకేజీకి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా  పదేళ్ల జైలుశిక్ష, పదికోట్లు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.   

నీట్‌ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో.. పేపర్ లీక్‌లు, మోసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది.  పేపర్‌ లీకేజీ పాల్పడిన నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. రాబోయే మార్పులను వివరిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని మోదీ గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్‌లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో  కేంద్ర కేబినెట్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 


గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశంలో పేపర్‌ లీకేజీకి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నాం. వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్‌ ఇయర్‌ వృథా కాకూడదనే వెంటనే నీట్‌ పరీక్ష నిర్వహించాం. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించింది.

ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను. ఆయా శాఖలు తీవ్రంగా శ్రమించి, రాత్రికి రాత్రే దీనికి ఆమోదం తెలిపాయి. రేపు (శుక్రవారం) దీనిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. మంత్రివర్గ సభ్యుల సూచనల అనంతరం దీనికి తుది రూపం ఇస్తారు. పార్లమెంట్ సమావేశాల రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం నుంచే, ఆ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు.

ప్రధాని మోదీ వీడియో ప్రకటనపై స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నొక్కి చెప్పారు.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)