Breaking News

'బద్మాషులు' సాంగ్‌ను విడుదల చేసిన ప్రియదర్శి

Published on Sun, 05/25/2025 - 11:53

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బద్మాషులు'. జూన్‌ 6న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జిందగీ బిలాలే’ సాంగ్‌ను విడుదల చేశారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హిలేరియస్ ఎంటర్టైనర్, తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  బి. బాలకృష్ణ, C.రామ శంకర్ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జిందగీ బిలాలే సాంగ్‌ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రియదర్శి  మాట్లాడుతూ.. 'బద్మాషులు సినిమా ప్రోమోషల్ సాంగ్ జిందగీ బిలాలే సాంగ్ విడుదల చేయడం జరిగింది, సాంగ్ చాలా ఎంటర్టైన్‌గా ఉంది, తేజ కూనూరు సంగీతం అందించారు, చరణ్ అర్జున్ , విహ పాడిన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను, టీజర్ హిలెరియ్‌గా ఉంది, ఫన్ టేక్ ఓవర్ చేసినట్లు ఉంది, జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ఆయన అన్నారు. ఇది మన ఊరి కథ అనే విధంగా ఈ చిత్రంలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయని మేకర్స్‌ అన్నారు. డైరెక్టర్ శంకర్ చేగూరి వంద శాతం జనాలను రెండు గంటలు నవ్వించాలనే ఉద్దేశ్యంతో బద్మాషులు చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు.

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి, డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)