Breaking News

తెరపైకి యువరాజ్‌ సింగ్‌ జీవితం

Published on Wed, 08/21/2024 - 03:34

భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. భూషణ్‌ కుమార్, రవిభాగ్‌ చందక్‌ నిర్మించనున్న ఈ బయోపిక్‌ను మంగళవారం ప్రకటించారు. భారత క్రికెట్‌లో పదిహేడేళ్ల సుదీర్ఘమైన సక్సెస్‌ఫుల్‌ కెరీర్, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం, క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడటం, 2007లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత టీమ్‌లో రాణించడం, ధోనీతో విభేదాలు అనే వార్త, ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమ అనే గాసిప్‌... ఇలా యువరాజ్‌ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

ఈ అంశాలను ఈ సినిమాలో ఎంత మేరకు చూపించాలనుకుంటున్నారని తెలియాల్సి ఉంది. అలాగే యువరాజ్‌ సింగ్‌గా ఎవరు నటించనున్నారు? దర్శకత్వం వహించేది ఎవరు? అనే విషయాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా  ఫ్యాన్స్‌ కోసం నా బయోపిక్‌ తెరకెక్కనున్నందుకు హ్యాపీగా ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ వారి కలలను నెరవేర్చుకునేలా నా బయోపిక్‌ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు యువరాజ్‌ సింగ్‌. 

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)