Breaking News

'యుగానికి ఒక్కడు' రీ-రిలీజ్‌.. సీక్వెల్‌లో హీరో ఎవరో తెలుసా..?

Published on Sun, 02/23/2025 - 09:13

కోలీవుడ్‌ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్‌లోకి రానుంది.  విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్‌ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.

యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్‌ కానున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్‌ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్‌ కానుందని ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్‌ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ్‌ వర్షన్‌ సన్‌నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.

యుగానికి ఒక్కడు సీక్వెల్‌ ప్లాన్‌
‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్‌ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్‌  అధికారికంగా గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ధనుష్‌ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన అన్నారు. యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్‌ అయింది. సీక్వెల్‌ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)