Breaking News

బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోకి హర్ష సాయి?

Published on Thu, 06/09/2022 - 16:22

'అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు'.. కానీ ఇతడు మాత్రం ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తుంటాడు. గుడిసెల ముందు నోట్ల కట్టలు గుమ్మరించడం,  తల దాచుకోవడానికి నీడ లేని వారికి ఇల్లు, పిల్లాడికో సైకిల్‌, పేద పిల్లాడి స్కూల్‌ ఫీజులు చెల్లించేందుకు చెక్కులు, బార్బర్‌కు షాప్‌ కట్టించడం.. ఇలా ఎన్నో మంచిపనులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలతో హర్ష సాయి రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతూ వీడియోలు చేస్తుండటం విశేషం. అవసరాన్ని బట్టి లక్షలు సైతం దానం చేస్తూ దానకర్ణుడిగా పేరు గడించాడు. త్వరలో 10 లక్షల రూపాయలను దానం చేసేందుకు రెడీ అవుతున్నాడు హర్షసాయి. 

ఇదిలా ఉంటే ఇటీవల బిగ్‌బాస్‌ 6 తెలుగు లోగో లాంచ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజవగా ఆ వీడియో కింద హర్షసాయి గురించే కామెంట్లు పెట్టారు. అన్న బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు, వచ్చి పేరు చెడగొట్టుకోవద్దని మరికొందరు కామెంట్లతో మోత మోగించారు. దీంతో బిగ్‌బాస్‌ ఎంట్రీపై తాజాగా హర్షసాయి స్పందించాడు. బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని నొక్కి చెప్పాడు. అందుకే యూట్యూబ్‌ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్‌లోడ్‌ చేయాలని నియమం పెట్టుకోకుండా నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

చదవండి: సినిమాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత
బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారినపడ్డ మహిమ చౌదరి, ప్రకటించిన నటుడు

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)