Breaking News

షూటింగ్‌లకు రాకుండా తిప్పలు పెడుతున్న యోగిబాబు?

Published on Thu, 08/31/2023 - 13:29

నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్‌. నటి రేచ్చల్‌ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్‌ దర్శకత్వం వహించారు. శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్‌ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు.

యోగిబాబును ఇండియన్‌ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్‌ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్‌ శక్తివేల్‌కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.

నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్‌ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్‌లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్‌కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు.

చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్‌.. కెరీర్‌ కోసం నేనూ అడ్జస్ట్‌ అయ్యా..: నటి

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)