Breaking News

యోగిబాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌ సినిమా.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Published on Fri, 01/02/2026 - 07:21

మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన యోగిబాబు ఇప్పుడు బిజీ నటుడు.  కమెడియన్‌ గానే కాకుండా హీరోగాను నటిస్తున్నారు. కోలీవుడ్‌లో యోగిబాబు లేని చిత్రం ప్రస్తుతకాలంలో లేదనే చెప్పవచ్చు. కాగా ఈయన నటిస్తున్న 300వ చిత్రానికి అర్జునన్‌ పేర్‌  పత్తు(Arjunan Peru Paththu) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.  కాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను నటుడు విజయ్‌ సేతుపతి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. దేవ్‌ సినిమాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై డి తంగపాండి, ఎస్‌ కృతిక తంగ పాండి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆర్‌.రాజమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే ఆనందాన్ని యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేశారు. 

ఇది ఇంతకుముందు యోగిబాబు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. పాత వాహనాల విక్రయాల్లో జరిగే మోసాలను, తద్వారా గురయ్యే ప్రజల బాధలను ఆశ్రయించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. అదేవిధంగా ఇకపై పాత వాహనాల క్రయ విక్రయాలపై  అవగాహన కలిగించే విధంగా, వాస్తవ ఘటనలతో రూపొందిస్తున్న చిత్రం అర్జునన్‌ పేర్‌ పత్తు అని చెప్పారు. ఇది అన్ని వర్గాలను ప్రేక్షకులను అలరింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు. 

ఈ చిత్రం ద్వారా నటి అనామిక మహి నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు కాళీ వెంకట్, అరుళ్‌ దాస్, అయిలి మదన్‌ ,ఎస్‌ సుబ్రహ్మణ్యం శివ, మైనర్‌ నందిని, సౌందర్య, సెన్‌ డ్రాయన్‌ ,హలో కందస్వామి, పావ లక్ష్మణ్, రంజన్‌ కుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటూ దర్శకుడు లెనిన్‌ భారతి కీలకపాత్రలో నటిస్తున్నారు. చిత్ర షూటింగును చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. దీనికి  డీ.ఇమాన్‌ సంగీతాన్ని, ప్రదీప్‌ కాళీరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని,  త్వరలోనే చిత్రం ట్రైలర్, ఆడియో విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు.   

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)