Breaking News

ఊహించని డైరెక్టర్‌తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

Published on Tue, 07/14/2026 - 19:19

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై  ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. మరి బోల్డ్‌గా ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ సినిమా సంగతి పక్కన పెడితే యశ్ నెక్ట్స్‌ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే యశ్ తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయంపై శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సప్త సాగరదాచే ఎల్లో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు హేమంత్‌ ఎం రావుతో జతకట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తన పేజీలో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.  ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్.. పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని ఐఎండీబీ తన పేజీలో పేర్కొంది. 

ఈ సినిమాకు హేమంత్ ఎం రావుతో పాటు యశ్ రచయితగా ఉండడం మరో విశేషం. ఈ మూవీని కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతాల నిర్మించనున్నారు. అయితే ఈ విషయంపై యశ్ కానీ, హేమంత్ ఎం రావు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హేమంత్ ఎం రావు ప్రస్తుతం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు.

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)