Breaking News

లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!

Published on Wed, 06/21/2023 - 12:40

పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర‍్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్‌లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?)

'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది.

మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్'‍ మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స‍్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట‍్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి