Breaking News

నాకు పొగరనుకున్నారు.. సినిమా ఛాన్సులు కోల్పోయా: యష్‌

Published on Mon, 03/24/2025 - 15:56

కేజీఎఫ్‌ (K.G.F Movie)తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు యష్‌ (Yash). అభిమానులు ఈయనను వెండితెరపై చూసి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యష్‌.. టాక్సిక్‌: ఎ ఫేరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. అటు బాలీవుడ్‌లో రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఇతడు బెంగళూరులో జరిగిన మనడ కదలు సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు. యోగరాజ్‌ భట్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది. 

తలపొగరు అనుకున్నారు
ట్రైలర్‌ రిలీజ్‌ అనంతరం యష్‌ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అందరూ నాకు పొగరు అనుకునేవారు. ఎందుకంటే దర్శకులను నేను స్క్రిప్ట్‌ కాపీ అడిగేవాడిని. కథ నచ్చకపోతే, దానిపై నాకు నమ్మకం కుదరకపోతే సినిమా ఎలా చేయగలను? ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక సినిమా మొదలుపెడదాం అనుకునేవాడిని. అది కొందరికి నచ్చేది కాదు దీనివల్ల చాలా సినిమాలు కోల్పోయాను. అయితే మొగ్గిన మనసు సినిమా నిర్మాత నన్ను బలంగా నమ్మాడు.  ఆయన వల్ల చివరి నిమిషంలో ఆ సినిమాలో జాయిన్‌ అయ్యాను. 

ఆ సినిమాయూనిట్‌పై ఇప్పటికీ గౌరవం..
దర్శకుడు శశాంక్‌ కథ పూర్తిగా చెప్పడంతోపాటు నా పాత్ర గురించి కూడా వివరించాడు. ఇప్పటికీ ఆ ఇద్దరిపై, ఆ సినిమా యూనిట్‌ మొత్తంపై నాకు ఎనలేని గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. టాక్సిక్‌ గురించి అప్‌డేట్‌ అడగ్గా.. ఇది సందర్భం కాదని దాటవేశాడు. తమపై నమ్మకం ఉంచి ఓపిక పట్టమని కోరాడు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్‌ 2026 మార్చి 19న విడుదల కానుంది. ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, అచ్యుత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: అమృతం నటుడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)