Breaking News

అతని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యశ్‌ దంపతులు

Published on Wed, 02/14/2024 - 18:10

రాకింగ్ స్టార్ యశ్‌ 'కేజీఎఫ్ 2' తర్వాత  నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్‌లో ఆయన ఫుల్‌ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యశ్‌ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు.

యశ్‌కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యశ్‌.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్‌ప్రైజ్‌ చేశారు.

యశ్‌ దగ్గర  చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్‌ సినిమా కెరియర్‌ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు.  చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్‌లు చేతన్‌ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే.


(చేతన్‌ వివాహ సమయంలో.. యశ్‌, రాధిక పండిట్‌)

చేతన్‌ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్‌ పనిలో బిజీగా ఉన్న యశ్‌ ఈ శుభ సమయంలో చేతన్‌ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్‌ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)