Breaking News

వైరముత్తు నవలలో విక్రమ్‌ నటిస్తారా?

Published on Sun, 04/23/2023 - 08:09

తమిళ సినిమా: వైవిధ్యానికి మారుపేరు నటుడు విక్రమ్‌. ఈయన నటించే చిత్రాల్లో నటుడు కనిపించరు పాత్రలే కనిపిస్తాయి. అన్నియన్‌, ఐ వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా విక్రమ్‌ నటిస్తున్న మరో విభిన్నమైన కథా చిత్రం తంగలాల్‌. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ను గుర్తు పట్టడం చాలా కష్టం. అంతగా మేకోవర్‌ అయ్యి ఆ పాత్రకు ప్రాణం పోస్తున్నారు.

కాగా ఈయన నటుడు కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాయ్‌, శరత్‌ కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రభు, పార్తీపన్‌ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ చిత్ర రెండో భాగం భారీ అంచనాల మధ్య ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. మరిన్ని చిత్రాలు విక్రమ్‌ చేతిలో ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం కోలీవుడ్లో జరుగుతోంది. ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన నవల కళ్లికాట్టు ఇతిహాసం. 14 గ్రామ ప్రజల పోరాటమే ఈ నవలలోని ప్రధానాంశం. ఇది 2003 సాహితీ అకాడమీ అత్యున్నత అవార్డును గెలుచుకుంది. కాగా ఈ నవల ఆంగ్లం, హిందీ తదితర 7 భాషల్లో అనువదించారు. తాజాగా ఈ నవలను సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: సిమ్రాన్‌

దీనికి మదయానై కూట్టం చిత్రం ఫేమ్‌ విక్రమ్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో నటుడు సియాన్‌ విక్రమ్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన అందులో నటించడానికి సమ్మతిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)