ఆ ఒక్క సంఘటనతో 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం!

Published on Mon, 12/08/2025 - 15:55

ఎన్టీఆర్‌.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్‌ అయినా, మాస్‌ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్‌, హరిన్‌ ఇద్దరూ యాక్టింగ్‌నే ఎంచుకున్నారు.

హీరోగా ఎంట్రీ
కళ్యాణ్‌ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్‌, రౌడీ బాబాయ్‌, అత్తగారు జిందాబాద్‌, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్‌ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.

ఆ విషాదంవల్లే..
నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్‌ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్‌ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్‌ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్‌దాస్‌ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 

36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ 
పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్‌ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్‌ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌లో కళ్యాణ్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. కాగా ఎన్టీఆర్‌ నామకరణం చేసిన వైజయంతి మూవీస్‌ సంస్థతోనే కళ్యాణ్‌ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్‌ 25న విడుదలవుతోంది.

చదవండి: రాత్రిపూట మనోజ్‌ ఫోన్‌కాల్‌.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్‌ నటుడు

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)