స్టార్‌ హీరోతో మమితా బైజు.. ఎందుకు తీసుకున్నామంటే: దర్శకుడు

Published on Thu, 04/16/2026 - 07:06

మలయాళ నటీమణులు కోలీవుడ్‌లో మంచి అవకాశాలను తన్నుకు పోతున్నారు. అదేసమయంలో తమిళ చిత్రాల్లో తమిళ నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు వంటి ఆరోపణలు ఇటీవల ఎక్కవగా వస్తున్నాయి.  ఇకపోతే ఇటీవల కోలీవుడ్‌లో మంచి క్రేజీ అవకాశాలను అందుకుంటున్న మాలీవుడ్‌ నటి మమితా బైజు(Mamitha Baiju). ఈమె సూర్యకు జంటగా విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా కర చిత్రంలోనూ నటించారు. అదేవిధంగా విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయకన్‌ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ప్రస్తుతం మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో కర చిత్రంలో పరభాషా నటి   మమితా బైజును నటింపజేయడం గురించి ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌రాజా ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ సినిమాల్లో నటీనటులను ఎంపిక చేయడం అనేది వారి భాష, ప్రాంతీయత ఆధారంగా ఎంపిక చేయడం ఉండదన్నారు. వారి నటనా ప్రతిభ, పాత్రలకు నప్పడం, ఉండే మార్కెట్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. కర చిత్రం విషయంలో మమితా బైజును ఎంపిక చేయడానికి కారణం ఆమె పోషించిన పాత్రకు అంతకుముందు 20–25 మందిని ఆడిషన్‌ చేసినట్లు చెప్పారు. 

వారెవరూ తగిన ప్రతిభను పదర్శించలేదన్నారు. అందరికంటే మమిత బైజు స్పష్టంగా బెటర్‌గా ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు విఘ్నేశ్‌రాజా వివరించారు. కాగా ధనుష్, మమితా బైజు జంటగా నటించిన కర చిత్రం 1990లో రామనాథపురంలో జరిగిన ఒక బ్యాంకు దోపిడీ ఇతివృత్తంతో రూపొందిందని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నది గమనార్హం.  

Videos

LIC షేర్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్.. ఇన్వెస్టర్లకు ఒక షేర్ కి బోనస్ షేర్

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)