Breaking News

'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!

Published on Thu, 08/24/2023 - 08:27

ఓ భర్త తన భార్యని మోసం చేశాడు. చెప్పాలంటే అలాంటి ఇలాంటి మోసం కాదు. పెళ్లి, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నప్పటికీ మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ఈ భార్యకి విడాకులు ఇచ్చేశాడు. దీంతో చాలా కుమిలిపోయింది. ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తన ఆవేదన బయటపెడుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు సడన్‌గా మాజీ భర్తకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అవును పైన చెప్పినది పవన్-రేణు దేశాయ్ గురించే..

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరికీ తెలుసు. ఈ విషయంలో తనని తాను ఎంత సమర్ధించుకున్నా.. ముగ్గుర‍్ని(వేర్వేరుగా) పెళ్లి చేసుకోవడం తప్పే కదా! కానీ ఈ మహానుభావుడు ఒప్పుకోడు. అప్పట్లో అలా జరిగింది, ఇలా చేశాను అని ఏదో కవర్ చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాడు. మొదటి భార్య గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మూడో భార్య మన దేశస్థురాలే కాదు. పవన్ పుణ్యామా అని రెండో భార్య రేణు దేశాయ్ మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

రీసెంట్‌గా తన యూట్యూబ్ ఛానెల్‌లో రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. తన విషయంలో పవన్ చేసింది ముమ్మాటికీ తప్పే అని చెబుతూనే.. పొలిటికల్‌గా ఆయన(పవన్) సమాజానికి ఉపయోగపడతారని, నమ్ముతున్నానని కామెంట్స్ చేసింది. పిల్లల్ని, కుటుంబాన్ని వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పింది. అయితే ఇవన్నీ పెద్దగా నమ్మేలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇలా సడన్ యూటర్న్ కొత్త కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఈమె ఇలా మాట్లాడటం వెనుక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. 

(చదవండి: చంద్రయాన్‌-3 పై సినిమా.. ఫస్ట్‌ ఛాయిస్ ఆ హీరోనే)

కె.రాఘవేంద్రరావు మనవడు, పవన్-రేణుల కొడుకు అకీరా.. ఇద్దరు కూడా ఈ మధ్యే అమెరికాలోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. ఈ విషయమై ట్వీట్ చేసిన కాసేపటికే రాఘవేంద్రరావు ఎందుకో ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయితే కొడుకు భవిష్యత్‌ని చూపించి రేణు దేశాయ్‌తో తన భర‍్త(పవన్) మంచోడు అని సర్టిఫికెట్ ఇప్పించి, ఎలక్షన్‌లోపు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చంద్రన్న-పవన్ కలిసి ఇదంతా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహం వస్తుంది. రేణు దేశాయ్ లేటెస్ట్ వీడియో వెనక చంద్రబాబు హస్తం ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది.

(చదవండి: పోలీస్‌ ఆఫీసర్లుగా ఆన్‌ డ్యూటీలో ఉన్న హీరోయిన్లు)

ఎందుకంటే చంద్రబాబుకి కె.రాఘవేంద్రరావుతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి పవన్-రేణు దేశాయ్‌ల వ్యవహారాన్ని వెనక వైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు.. ఇలా తన దత్తపుత్రుడి ఇమేజ్ కాపాడటానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కాలమే నిర్ణయిస్తుందిలే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)