Breaking News

అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక తెలుగు హిట్‌ సినిమా ఏదో తెలుసా..?

Published on Thu, 02/22/2024 - 19:16

మంచి కథ ఉంటే ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనేది నిజం. అందుకే అలాంటి కథలు ఏ భాషలో దొరికినా రీమేక్‌ల రూపంలో వాటిని మళ్లీ తెరకెక్కించి విడుదల చేస్తారు మేకర్స్‌. ఇప్పుడంటే ఈ ట్రెండ్‌ కాస్త తగ్గినప్పటికీ గతంలో ఎక్కువగా అరువు కథలకే ఎక్కవగా ప్రయారిటీ ఇచ్చేవారు.

ఒక భాషలో సూపర్‌ హిట్ అయిన సినిమా నాలుగైదు భాషల్లోకి రీమేక్‌ కావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ టాలీవుడ్‌లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్‌ అయింది. సిద్ధార్థ్‌, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్‌ చేశారు. సుమంత్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎస్‌ రాజు దీనిని నిర్మించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.

ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి చిక్కులు వచ్చాయి అనేది ఈ చిత్రం కథ. ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. 35 సెంట‌ర్స్‌లో వంద రోజులు ఆడింది. తొమ్మిది భాష‌ల్లో రీమేకైన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్‌ అయింది. ఏ భాషలో ఏ పేరుతో విడుదలైందో మీరూ తెలుసుకోండి.

1. ఉనక్కం ఎనక్కం (తమిళం)
2. నీనెల్లో నానల్లే (కన్నడ)
3. రామయ్య వస్తావయ్యా (హిందీ)
4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా)

5. నింగోల్‌ తజబ(మణిపురి)
6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ)
7. ఐ లవ్‌ యు (బెంగాలీ)
8. నిస్సా అమర్‌ తుమీ (బంగ్లాదేశ్‌ బెంగాలీ)
9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)