Breaking News

Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్‌ అయిన రాకేష్‌ మాస్టర్‌

Published on Sun, 06/18/2023 - 19:26

తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్‌.రామారావు అలియాస్‌ రాకేశ్‌ మాస్టర్‌(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్‌లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్‌ని చూసి డ్యాన్సర్‌గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్‌ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే  వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు.

ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్‌ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్‌కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్‌స్టిట్యూట్‌ను నడిపారు. 

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత)

రాకేష్‌ మాస్టర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఇదే..

ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే.

శేఖర్‌ మాస్టర్‌తో విబేదాలు

టాలీవుడ్‌లో ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ అయిన శేఖర్‌ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్  పెద్దగా రియాక్ట్‌ అయిన సందర్భాలు లేవు.  ఒకరోజు ఫేస్‌బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్‌కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు.

గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే 
రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్‌తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య  ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్‌పై ఫైర్‌ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది.

(ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)