Breaking News

వేలం పాటలో నన్ను అమ్మేయాలని చూశాడు: హీరోయిన్‌

Published on Wed, 03/13/2024 - 13:33

అన్ని ప్రేమకథలు సుఖాంతం కావు.. ఇక్కడ చెప్పుకునే జంట కూడా అదే కోవలోకి వస్తుంది. హీరో అభిషేక్‌ బచ్చన్‌- హీరోయిన్‌ కరిష్మా కపూర్‌ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం జరిగింది. తర్వాత పలు కారణాలతో అది రద్దయిపోయింది. అనంతరం అభిషేక్‌.. రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడిపాడు, కానీ అది కూడా సెట్‌ కాలేదు. చివరకు ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

2003లో పెళ్లి
అటు కరిష్మా కపూర్‌.. 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ను పెళ్లాడింది. వీరికి సమీరా, కిరణ్‌ అని ఇద్దరు సంతానం. కొంతకాలానికి ఈ జంట మధ్య పొరపచ్చాలు రావడంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా 2016లో మంజూరయ్యాయి. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కరిష్మా ప్రస్తుతం 'మర్డర్‌ ముబారక్‌' అనే వెబ్‌ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ క్రమంలో ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

వేలానికి పెట్టాలని..
గతంలోని ఓ ఇంటర్వ్యూలో కరిష్మా మాట్లాడుతూ.. భర్తతో హనీమూన్‌కు వెళ్లినప్పుడు తన స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి తీసుకొచ్చాడని వాపోయింది. ఒకానొక సమయంలో తనను వేలానికి పెట్టి అమ్మేయాలని చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి తన తల్లితో కొట్టించాలని చూశాడని బాధపడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో పడరాని కష్టాలు పడుతుండటంతో ఆమె తండ్రి రణ్‌ధీర్‌ కపూర్‌ తల్లడిల్లిపోయాడు.

డబ్బు వెనక పరుగెత్తాల్సిన అవసరం లేదు
సమాజంలో మా స్థాయేంటో, మా స్థానమేంటో అందరికీ తెలుసు. మేము డబ్బుకోసం పాకులాడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మాకు ప్రతిభ, డబ్బు.. రెండింటినీ ఇచ్చాడు. ఆ సంజయ్‌.. థర్డ్‌ క్లాస్‌ వ్యక్తి.. అతడితో పెళ్లంటేనే నాకిష్టం లేదు. వాడెప్పుడూ నా కూతుర్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నా బిడ్డను వదిలేసి మరో అమ్మాయితో తిరిగాడు. అతడెలాంటివాడో ఢిల్లీ మొత్తానికి తెలుసు అంటూ ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన విషయం తెలిసిందే!

చదవండి: సూర్య కంటే జ్యోతిక ఆస్తి ఎక్కువ? ఎవరి దగ్గర ఎంతంటే?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)