Breaking News

సినీ‘వారం’: సాయితేజ్‌ ట్వీట్‌.. మంచు విష్ణు ఫైర్‌.. సారీ చెప్పిన సిద్ధార్థ్‌

Published on Sun, 07/14/2024 - 12:17

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరింది. జులై 27న విడుదలైన ఈ చిత్రం.. రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు (పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)

సోషల్‌ మీడియాలో జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ.. పిల్లల వీడియోలు షేర్‌ చేయ్యొదంటూ మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశాడు. అది కాస్త వైరల్‌ కావడంతో కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. (పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)


సోషల్ మీడియాలో నటి నటులపై ట్రోలింగ్ వీడియోలు డార్క్ కామెడీ పేరుతో వీడియోలు వేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)’ అధ్యక్షుడు  మంచు విష్ణు హెచ్చరించాడు. చెప్పినట్లుగానే నటీనటుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న  ఐదు యూట్యూబ్ ఛానెల్స్‌ని తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమే అని చెబుతూ యూట్యూబర్స్‌కి 'మా' అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. (పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)


భారతీయుడు 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సిద్ధార్థ్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాని అవమానించినట్లుగా ఉన్నాయంటూ సిద్ధార్థ్‌ను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. దీంతో సిద్దూ వెంటనే స్పందించి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.(పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి)

68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరితో పాటు మొత్తం 8 అవార్డుల‌ను సోంతం చేసుకుంది. ఇక ఉత్త‌మ న‌టిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన భారతీయుడు 2 చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ తొలి రోజే నెగెటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. శంకర్‌ మేకింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్స్‌ దారుణంగా తగ్గిపోయాయి. (‘భారతీయుడు 2’ సినిమా రివ్యూలో కోసం క్లిక్‌ చేయండి)

రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా చిత్రం ఈ నెల 12న విడుదలైంది. రీ. ‘సమానత్వం’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో డైరెక్టర్‌ పండు మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించాడు. ఇందులో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు.. కులమత ప్రస్తావన, లింగ మార్పిడి ప్రస్తావన కూడా ఉంది. (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ట్రైలర్ జులై 10న విడుదల అయింది.కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. (ట్రైలర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార సాంగ్ జూలై 10నరిలీజ్‌ అయింది. (సాంగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ప్రియదర్శి నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్.  అయ్యింది ఈ సినిమా జూలై 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. (ట్రైలర్‌ కోసం క్లిక్‌ చేయండి)

కిరణ్ అబ్బవరం నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాకు ‘క’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.శ్రీ చక్రాస్‌ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు (పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి)

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో టాలవుడ్‌ నటులు సందడి చేశారు.  మహేశ్ బాబు, రానా, రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్, రాశీఖన్నా సహా పలువురు టాలీవుడ్‌ తారలు  ఈ వివాహానికి  హాజరయ్యారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)