Breaking News

ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Published on Mon, 04/03/2023 - 19:01

ఇప్పుడిప్పుడే థియేటర్లలో వేసవి సందడి కనిపిస్తోంది.  ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే మక్కువ చూపుతున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.  ఈ వారం కూడా మిమ్మల్ని అలరించేందుకు ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈవారంలో థియేటర్లలో టాలీవుడ్ చిత్రాలు మాస్ హీరో రవితేజ నటించిన రావణాసుర, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఈ వారంలో విడుదలయ్యే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలేవో తెలుసుకుందాం. 

రవితేజ రావణాసుర

మాస్‌ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌ నటింటారు. హీరో సుశాంత్‌ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు.  ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్‌లలో విడుదల కానుంది.

కిరణ్ 'మీటర్'

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్‌ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్‌ హీరోయిన్‌ అతుల్య రవి  ఇందులో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్‌ అబ్బవరం పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్‌ 7న విడుదల కాబోతోంది. 

‘ఆగస్టు 16, 1947’

 ప్రముఖ దర్శకుడు ఆర్‌.మురుగదాస్‌ నిర్మించిన చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్‌ కార్తిక్‌, రిచర్డ్‌ ఆస్టన్‌ నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

  • బీఫ్‌ (వెబ్‌సిరీస్‌) -ఏప్రిల్‌ 6
  • ఇన్‌ రియల్‌ లవ్‌ -(టీవీ షో) ఏప్రిల్‌ 6
  • చుపా (హాలీవుడ్)- ఏప్రిల్‌ 7
  • హంగర్‌ (హాలీవుడ్)- ఏప్రిల్‌8

జీ5

  • అయోథి (తమిళం) -ఏప్రిల్‌ 7

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • ది క్రాసోవర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4

బుక్‌ మై షో

  • బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 5
  • కాస్మోస్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 7

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)