Breaking News

ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే

Published on Mon, 05/15/2023 - 15:08

ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో చిత్రాలు చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పటిలాగే సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారం కూడా వరుస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. టాలీవుడ్‌తో పాటు మిమ్మల్ని అలరించే వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. 

‘అన్నీ మంచి శకునములే’
సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. యువ నిర్మాతలు స్వప్నదత్‌, ప్రియాంకదత్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘బిచ్చగాడు-2’

‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నారు 
తమిళ హీరో, దర్శకుడు విజయ్‌ ఆంటోని బిచ్చగాడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 అలరించేందుకు వస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఫాస్ట్‌ ఎక్స్‌

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు పరిచయమున్న సిరీస్‌ ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’. ఆ సిరీస్‌లో రాబోతున్న తర్వాతి చిత్రం ఫాస్ట్‌ ఎక్స్‌. జస్టిన్‌ లిన్‌ దర్శకుడు. ఈ చిత్రంలో జాసన్‌ మొమోవా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన ఫాస్ట్‌ ఎక్స్‌ మే 19న రిలీజ్ కానుంది. 

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అఖిల్ ఏజెంట్

అక్కినేని హీరో అఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచింది.  ప్రస్తుతం సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించగా.. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు.

 నిహారిక 'డెడ్ పిక్సెల్స్'

మెగా డాటర్ నిహారిక కొణిదెల డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ నెల 19న రిలీజ్ కానుంది. 

నెట్‌ఫ్లిక్స్‌

    అయాలవాషి  -మలయాళం-మే 19
    కథల్‌ - హిందీ - మే 19

    బయీ అజైబి -ఇంగ్లీష్‌ - మే 19
    మ్యూటెడ్‌- ఇంగ్లీష్‌- మే 19
    నామ్‌- సీజన్‌-2- మే 1

సోనీ లివ్‌

    కడిన కదోరమీ అంద కదహం -మలయాళం- మే 19

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    మోడ్రన్‌ లవ్‌ చెన్నై -తమిళ్‌- మే 18

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)